Kadiam Srihari: నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను: కడియం శ్రీహరి

Kadiyam Srihari reveals why he was joined congress

  • కూతురు కావ్యతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజును కలిసిన కడియం శ్రీహరి
  • కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి
  • లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరానన్న కడియం శ్రీహరి

తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన కూతురు కడియం కావ్యతో కలిసి హన్మకొండలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజును, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ దంపతులను ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తో మాత్రమే సాధ్యమని చెప్పారు.

ఎమ్మెల్యే ఆర్ నాగరాజు మాట్లాడుతూ... ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకు ఏటీఎంలా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో ప్రస్తుత కరవు పరిస్థితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తే ప్రజలు తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.

More Telugu News