Jagapathi Babu: ఖాళీగా కూర్చుని అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులవి: జగపతిబాబు

Jagapathibabu Interview

  • 'లెజెండ్'తో విలన్ గా మారిన జగ్గూ భాయ్ 
  • ఆ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అయిందని వెల్లడి
  • బాలయ్య అభిప్రాయం సరైనదని వ్యాఖ్య 
  • ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయమని వివరణ  

హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, విలన్ గా కూడా గొప్పగా చేస్తాడని నిరూపించిన సినిమా 'లెజెండ్'. ఇటీవలే ఈ సినిమా పదేళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ .. 'లెజెండ్' పదేళ్లను పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫంక్షన్ కి వెళ్లడానికి ట్రై చేశానుగానీ కుదరలేదు. నా కెరియర్లో ఎప్పటికీ మరిచిపోలేని సినిమానే ఇది" అని అన్నారు. 

'లెజెండ్' సినిమాకి ముందు మూడేళ్లపాటు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఎవరైనా సరే నాతో సినిమాలు చేస్తారేమోనని అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చునేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నన్ను వెతుక్కుంటూ 'లెజెండ్' సినిమా వచ్చింది. నేను విలన్ గా చేస్తానా లేదా అనే సందేహంతో వాళ్లు వచ్చారు. నేను ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఒప్పుకున్నాను. ఈ సినిమా నా కెరియర్ కి చాలా హెల్ప్ అయింది" అని చెప్పారు. 

" జగపతిబాబు విలన్ గా చేయడమేంటని చాలామంది విమర్శించారు. సినిమా రిలీజ్ తరువాత చాలామంది మెచ్చుకున్నారు. ఆ స్థాయి పవర్ ఫుల్ విలనిజం విలన్ వైపు నుంచి ఉండటానికి హీరోగా బాలకృష్ణగారు ఒప్పుకోవడం విశేషం. విలన్ పవర్ ఫుల్ గా ఉన్నప్పుడే హీరోయిజం నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే ఆయన మాట అక్షర సత్యం. ఆయనతో నటించడం నాకు ఎంతో కంఫర్టబుల్ గా ఉండేది" అని అన్నారు. 

Jagapathi Babu
Actor
Legend Movie
Balakrishna
Boyapati Sreenu
  • Loading...

More Telugu News