Chandrababu: వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి ఈసీ అభ్యంతరం చెప్పింది...  ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి: చంద్రబాబు

Chandrababu wrote AP CS and CEO on pensions distribution

  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై సందేహాలు
  • ప్రజలకు ఊరటనిచ్చిన ఎన్నికల సంఘం... పెన్షన్ల పంపిణీకి ఓకే
  • అయితే వాలంటీర్లను వినియోగించవద్దని ఆదేశాలు
  • రాష్ట్ర సీఎస్, సీఈవోలకు చంద్రబాబు లేఖ 

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేపు (ఏప్రిల్ 1) నెలవారీ పింఛన్లు ఇస్తారా, లేదా? అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రజలకు ఊరటనిచ్చింది. పెన్షన్ల పంపిణీకి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, పెన్షన్లు అందించేందుకు వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

ఈసీ నిర్ణయంపై రాష్ట్ర సీఎస్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో... ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ల పంపిణీ నిలిచిపోకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.

Chandrababu
Pensions
EC
AP CS
CEO
TDP
YSRCP
  • Loading...

More Telugu News