Raghunandan Rao: రఘునందన్ రావుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

BRS complaint against Raghunandan Rao over his comments

  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
  • బీఆర్ఎస్ నేతలపై పరుషపదజాలంతో మాట్లాడినట్లు పేర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • తద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు

బీజేపీ మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలపై చేసిన వ్యాఖ్యలపై ఈ ఫిర్యాదు చేశారు. వారిపై రఘునందన్ రావు పరుషపదజాలంతో మాట్లాడి ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.

Raghunandan Rao
BJP
BRS
Election Commission
  • Loading...

More Telugu News