Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను సత్కరించిన ఎస్వీఎస్ఎన్ వర్మ కుటుంబ సభ్యులు

SVSN Varma family members felicitates Pawan Kalyan
  • పిఠాపురం నుంచి నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్న పవన్
  • దొంతమూరులో వర్మ నివాసంలో  పవన్ కు ఆత్మీయ స్వాగతం
  • వర్మ తల్లి పద్మావతి ఆశీస్సులు అందుకున్న పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి విజయభేరి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మధ్యాహ్నం పిఠాపురం చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడ్నించి దొంతమూరు తరలివెళ్లారు. 

గొల్లప్రోలు నుంచి దొంతమూరు వరకు భారీగా విచ్చేసిన కూటమి శ్రేణులు పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికాయి. ఇక, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసానికి వెళ్లిన పవన్ కు వర్మ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. 

పవన్... ఈ సందర్భంగా వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వర్మ కుటుంబ సభ్యులు పవన్ ను ఘనంగా సత్కరించారు.  అనంతరం పవన్ కల్యాణ్... వర్మతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

ఈ భేటీలో సుజయకృష్ణ రంగారావు కూడా పాల్గొన్నారు. వర్మను, సుజయకృష్ణ రంగారావును పవన్ సన్మానించారు. జనసేన, టీడీపీ శ్రేణులతోనూ పవన్ కల్యాణ్ మాట్లాడారు. పవన్... వర్మ నివాసంలో భోజనం చేయనున్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
SVSN Varma
Pithapuram
Janasena
TDP

More Telugu News