Kadiam Srihari: కాంగ్రెస్ నన్ను ఆహ్వానించింది... సాయంత్రం అన్ని వివరాలు వెల్లడిస్తా: కడియం శ్రీహరి

Kadiyam Srihari responds on his party change

  • బంజారాహిల్స్‌లో కార్యకర్తలు, అనుచరులతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే భేటీ
  • అనుచరులు, కార్యకర్తలతో పార్టీ మార్పు అంశంపై చర్చించినట్లు వెల్లడి
  • తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు వెంటే ఉంటానని చెప్పారన్న కడియం శ్రీహరి
  • కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు కోసం తన నిర్ణయం ఉంటుందని వెల్లడి

తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందని... సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన బంజారాహిల్స్‌లో కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కడియం శ్రీహరితో పాటు కూతురు కడియం కావ్య పాల్గొన్నారు. సమావేశం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ... తన అనుచరులు, కార్యకర్తలతో పార్టీ మార్పు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు. తనను కాంగ్రెస్ నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు.

తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు తన వెంటే ఉంటానని చెప్పారని వెల్లడించారు. తనతో వచ్చే ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన అనుచరుల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. అందరితో మాట్లాడిన తర్వాత సాయంత్రం వివరాలు వెల్లడిస్తానన్నారు.

More Telugu News