Nandamuri Suhasini: పార్లమెంట్ ఎన్నికల వేళ.. రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి సుహాసిని

Nandamuri Suhasini meets Revanth Reddy

  • ఉదయం రేవంత్ నివాసానికి వెళ్లిన నందమూరి సుహాసిని
  • కొండా సురేఖ, పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో రేవంత్ ను కలిసిన వైనం
  • ఆసక్తికరంగా మారిన రేవంత్, సుహాసిని కలయిక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.  

Nandamuri Suhasini
Telugudesam
Revanth Reddy
Konda Surekha
Patnam Mahender Reddy
Congress
TS Politics
  • Loading...

More Telugu News