Jagan: నేడు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర.. రూట్ మ్యాప్ ఇదిగో!

Jagan Memantha Siddham yatra 4th day road map

  • నాలుగో రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • ఉదయం 11 గంటలకు గుంతకల్ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యాత్ర
  • 11.30 గంటలకు గుత్తిలో రోడ్ షో

ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో కొనసాగిన యాత్ర... ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. నిన్న రాత్రి కర్నూలు జిల్లా పత్తికొండలోని కేజీఎన్ ఫంక్షన్ హాలు వద్ద జగన్ బస చేశారు. ఈనాటి యాత్ర పత్తకొండ నుంచి ప్రారంభమవుతుంది. గుంతకల్ నియోజకవర్గం బసినేపల్లి వద్ద యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గుత్తిలో జగన్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో జగన్ బస చేస్తారు. 

మేమంతా సిద్ధం యాత్ర నేటి రూట్ మ్యాప్:

Jagan
YSRCP
Memantha Siddham
Anantapur District
  • Loading...

More Telugu News