Hero Nikhil: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్

Hero Nikhil joins TDP

  • ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
  • నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యువ హీరో
  • నిఖిల్ కు పసుపు కండువా కప్పిన లోకేశ్

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇవాళ టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. 

నిజంగా ఇది ఎవరూ ఊహించని పరిణామం. నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక స్పృహతో కొన్ని పోస్టులు పెట్టినప్పటికీ, రాజకీయాలపై అతడికి ఆసక్తి ఉన్న విషయం పెద్దగా ఎప్పుడూ బయటికి రాలేదు. 

ఇప్పుడు ఎన్నికల సమయంలో నిఖిల్ టీడీపీలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ఆయన ఏదైనా టికెట్ ఆశించినప్పటికీ, టీడీపీ తుది జాబితా కూడా వచ్చేసింది. మరి, నిఖిల్ కు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ ఉన్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరు. ఈ మధ్య కాలంలో కార్తికేయ-2, 18 పేజెస్, స్పై చిత్రాలతో ఆకట్టుకున్నాడు. సంబరం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో తొలి హిట్ కొట్టాడు. ఆ తర్వాత స్వామి రా రా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకున్నాడు.

Hero Nikhil
TDP
Nara Lokesh
Andhra Pradesh
  • Loading...

More Telugu News