Etela Rajender: 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదు: ఈటల రాజేందర్ కౌంటర్

Etala Rajender warning to congress

  • 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న ఈటల
  • కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు
  • మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్డు షో తర్వాత మద్దతు మరింత పెరిగిందన్న ఈటల

కాంగ్రెస్ పార్టీతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని... కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజ్‌గిరి లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ ఎమ్మెల్యేలను వారు టచ్‌లోకి తీసుకోవడం కాదు... 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం తమకు పెద్ద విషయం కాదని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నాయకులను కొనుగోలు చేస్తోందని విమర్శించారు. మల్కాజ్‌గిరిలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు షో తర్వాత బీజేపీకి మద్దతు మరింత పెరిగిందన్నారు.

Etela Rajender
BJP
Congress
Revanth Reddy
  • Loading...

More Telugu News