Jagan: మే 13న పేదలకు, పెత్తందార్లకు మధ్య కురుక్షేత్రం జరగబోతోంది: సీఎం జగన్
- మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర
- నేడు ఎమ్మిగనూరులో సభ
- పేదలంతా ఒకవైపు, పెత్తందార్లు ఒకవైపు అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు
- కూటమి పేరుతో కుట్రలు చేసే మోసగాళ్లను నమ్మవద్దని పిలుపు
ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రం అని అభివర్ణించారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అని... పేదలంతా ఒక వైపు, పెత్తందార్లు మరో వైపు అని పేర్కొన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
"పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జెండాలు జత కట్టిన పెత్తందార్లను ఓడించేందుకు మీరు సిద్ధమా?" అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి... ఎన్నికల్లో గెలిచేది మనమే... ఏ కుట్రలూ మనల్ని అడ్డుకోలేవు అని ధీమా వ్యక్తం చేశారు.