Pocharam Srinivas: చెత్త అంతా పోయింది: నేతలు పార్టీ మారడంపై పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్య

Pocharam Srinivas Reddy fires at leaders who leaving party

  • పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని విమర్శ
  • మోసకారుల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్‌దే అన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయన్న మాజీ స్పీకర్

పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరడంపై మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొంతమంది వెళ్లడంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి చెత్త అంతా పోయిందని వ్యాఖ్యానించారు. గట్టి వాళ్లు మాత్రమే పార్టీలో మిగిలారన్నారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోసకారుల జాబితా రాస్తే తొలిపేరు బీబీ పాటిల్‌దే అన్నారు. తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయన్నారు. ఎవరు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు.

శుక్రవారం సిద్దిపేట జిల్లా ఆందోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయని... బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 100 పథకాల గురించి చెబుతామని... కానీ బీజేపీ అమలు చేసిన ఒక్క పథకం గురించి చెప్పగలరా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని ఆరోపించారు.

More Telugu News