Rashmika Mandanna: 'ఫ్యామిలీ స్టార్' ట్రైల‌ర్‌పై ర‌ష్మిక మంద‌న్న‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ రిప్లై ఇదీ!

Rashmika Mandanna Tweet on Family Star Movie Trailer

  • మూవీ ట్రైల‌ర్ చూసి హిట్ కొడుతున్నారు.. పార్టీ కావాల‌న్న ర‌ష్మిక మంద‌న్న‌
  • క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌
  • గీత గోవిందం లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత రిపీట్ అవుతున్న ప‌ర‌శురామ్‌, విజ‌య్ కాంబో 
  • ఏప్రిల్ 5వ తేదీన థియేట‌ర్ల‌లోకి 'ఫ్యామిలీ స్టార్'  

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న 'లైగ‌ర్' మూవీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఘోరంగా దెబ్బ తీసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన 'ఖుషీ' కూడా యావ‌రేజ్ టాక్‌తోనే స‌రిపెట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ రౌడీబాయ్ ఆశ‌లన్నీ 'ఫ్యామిలీ స్టార్' చిత్రంపైనే ఉన్నాయి. గురువారం ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. ఈ ట్రైల‌ర్ చూసిన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదికగా స్పందించింది. ట్రైల‌ర్ చాలా బాగుంది, మీరు త‌ప్ప‌కుండా హిట్ కొడ‌తారంటూ విజ‌య్‌ను పార్టీ కావాల‌ని అడిగింది.

"నాకెంతో ఇష్ట‌మైన విజయ్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురామ్‌.. ఫ్యామిలీ స్టార్‌తో విజ‌యాన్ని అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 5వ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు త‌ప్ప‌కుండా హిట్ కొడ‌తారు. పార్టీ కావాలి" అని ర‌ష్మిక ట్వీట్ చేసింది. దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ 'క్యూటెస్ట్' అని రిప్లై ఇచ్చాడు. 

ఇక ఏప్రిల్ 5వ తేదిన విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న 'ఫ్యామిలీ స్టార్‌'పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట‌ర్ ప‌రశురామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంతకుముందు 'గీత గోవిందం' లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చారు. అదే కాంబినేష‌న్‌లో 'ఫ్యామిలీ స్టార్' వ‌స్తుండ‌డంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే తాజాగా విడుద‌ల‌యిన సినిమా ట్రైల‌ర్ కూడా బాగానే ఉంది. విజ‌య్ ప‌క్క‌న మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. 'గీత గోవిందం'కు సంగీతం అందించిన గోపి సుంద‌రే ఈ చిత్రానికి కూడా బాణీలు ఇచ్చారు. ఇప్ప‌టికే విడుద‌ల‌యిన పాట‌లు శ్రోతల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి కూడా. ఇలా అన్ని పాజిటివ్ వైబ్స్‌తో 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఇదిలాఉంటే.. గురువారం మూవీ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ కార్య‌క్ర‌మం తిరుప‌తిలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మాట్లాడుతూ.. "స్వామివారి ద‌ర్శ‌నం కోసం ఇప్ప‌టికే చాలాసార్లు తిరుప‌తి వ‌చ్చా. ఈ ప్రాంతం నుంచి మా సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్ట‌డం ఆనందంగా ఉంది. ప‌ర‌శురామ్‌తో ఇప్ప‌టికే గీత గోవిందం చేశా. దానిని మించి ఈ చిత్రం ఉండ‌నుంది. ఎమోష‌న్, యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ ఈ చిత్రంలో పుష్క‌లంగా ఉన్నాయి. ఇలా అన్నీ ఒక సినిమాలో కుద‌ర‌డం చాలా అరుదు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం. ఈ స‌మ్మ‌ర్ సెల‌వుల్లో మీరు ఈ మూవీతో త‌ప్ప‌కుండా ఎంట‌ర్‌టైన్ అవుతారు. రిలీజ్ త‌ర్వాత మ‌ళ్లీ స‌క్సెస్ మీట్‌లో క‌లుద్దాం" అని అన్నారు.

More Telugu News