TDP: టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన 'నిజం గెలవాలి' టీమ్... హాజరైన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari attends TDP Foundation Day celebrations

  • 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్
  • నేడు 42వ ఆవిర్భావ దినోత్సవం
  • ఉండవల్లిలో కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి 

తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేడు 42వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. నిజం గెలవాలి టీమ్ ఆధ్వర్యంలోనూ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిపారు. ఉండవల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు. తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కేక్ ను కట్ చేసి టీడీపీ కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు.

More Telugu News