Kadiyam Srihari: మరో కీలక పరిణామం.. కడియం శ్రీహరికి ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy calls Kadiam Srihari

  • బీఆర్ఎస్ ను ఒక్కొక్కరుగా వీడుతున్న కీలక నేతలు
  • నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కడియం శ్రీహరి కూతురు కావ్య
  • ఈరోజు రేవంత్ తో కడియం శ్రీహరి భేటీ అయ్యే అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై శ్రీహరితో రేవంత్ చర్చించారు. వీరిద్దరూ ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. 

కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. కావ్య కాంగ్రెస్ పార్టీ తరపున వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కడియం శ్రీహరి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో ఉన్నారు. 

మరోవైపు కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో సీనియర్ నేత కె.కేశవరావు భేటీ అయ్యారు. కేకే, ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

Kadiyam Srihari
Kadiyam Kavya
Revanth Reddy
Congress
KCR
BRS
TS Politics
  • Loading...

More Telugu News