Ravichandran Ashwin: అసలు ఐపీఎల్ అంటే క్రికెట్టేనా అనే సందేహం కలుగుతుంటుంది: రవిచంద్రన్ అశ్విన్

Sometimes I Wonder If IPL Is Even Cricket says R Ashwin

  • ఐపీఎల్ విస్తృతి చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంటుందన్న రవిచంద్రన్ అశ్విన్
  • ఆటగాళ్ల ట్రెయినింగ్, అడ్వర్టైజింగ్ షెడ్యూళ్ల మధ్య క్రికెట్‌ ఒక్కోసారి వెనకబడుతోందని వ్యాఖ్య
  • ఐపీఎల్ ఇంతగా అభివృద్ధి చెందుతుందని తొలినాళ్లల్లో చాలా మంది ఊహించలేదని వెల్లడి

ఐపీఎల్ విస్తృతి చూస్తుంటే అసలు ఇది క్రికెట్టేనా అని ఒక్కోసారి సందేహం కలుగుతుంటుందని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల ట్రెయినింగ్, అడ్వర్టటైజింగ్ షూట్ల మధ్య కొన్ని సందర్భాల్లో క్రికెట్‌ వెనకబడుతుందని అన్నాడు. 2008 నుంచి ఇప్పటివరకూ ఐపీఎల్ టోర్నీ ప్రస్థానంపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. పదేళ్ల క్రితం తాను తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడినప్పుడు ఈ టోర్నీ ఇంత విస్తృతమవుతుందని అనుకోలేదని చెప్పాడు. ఓ యువ క్రీడాకారుడిగా అనుభవజ్ఞుల నుంచి నేర్చుకోవాలనే ఒకేఒక లక్ష్యంతో ఐపీఎల్‌లో ఆడటం ప్రారంభించినట్టు తెలిపాడు. ప్రస్తుతం ఆర్.అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అతడు 500 టెస్టు వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు.

‘‘ఐపీఎల్ అభివృద్ధి ఈ స్థాయిలో ఉంటుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. సీఎస్‌కేలో ఉన్నప్పుడు నేను స్కాట్ స్టైరిస్‌తో జరిపిన సంభాషణ ఇప్పటికీ గుర్తుంది. ఐపీఎల్ మూడు నాలుగు ఏళ్లకు మించి ఉండదని అప్పట్లో అతడు అన్నాడు. తొలి రోజుల్లో ఐపీఎల్‌లోకి భారీగా నిధుల వరద పారింది. ఇప్పుడు టోర్నమెంట్‌లో గెలుపు ఆక్షన్స్‌లో నిర్ధారణ అవుతున్నట్టే అనిపిస్తుంటుంది. కానీ, టీం కంటే ఏ ఒక్క ప్లేయరూ గొప్ప కాదు. ఏ స్లాటూ మరో దానికంటే మెరుగైనది కాదు. అయితే, కాలక్రమంలో ఫ్రాంఛైజీ యాజమాన్యాలు మెరుగైన జట్లను కూర్చడంలో మంచి నైపుణ్యాలు సాధించాయి’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

Ravichandran Ashwin
IPL 2024
Cricket
  • Loading...

More Telugu News