Mahesh Babu: మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు కుటుంబం!

Mahesh Babu family enjoying in snow

  • సమ్మర్ వెకేషన్ కు వెళ్లిన మహేశ్ బాబు ఫ్యామిలీ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
  • షూటింగ్ బిజీ వల్ల వెళ్లలేకపోయిన మహేశ్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూటి ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం సమ్మర్ వెకేషన్ కు స్విట్జర్లాండ్ వెళ్లింది. అక్కడ మంచులో ఎంజాయ్ చేస్తోంది. మహేశ్ భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలు స్విట్జర్లాండ్ కు వెళ్లారు. సినిమా షూటింగ్ లో మహేశ్ బాబు బిజీగా ఉండటం వల్ల ఆయన వెళ్లలేదు. మంచులో మహేశ్ ఫ్యామిలీ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను నమ్రత ఇన్స్ట్రాలో పోస్ట్ చేశారు. హాట్ సమ్మర్ లో కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 

Mahesh Babu
Family
Tollywood
Switzerland
Summer Vacation
  • Loading...

More Telugu News