Srinu Vaitla: 'వెంకీ' సినిమా కథ అలా పుట్టింది: దర్శకుడు శ్రీను వైట్ల

Srinu Vaitla Interview

  • శ్రీను వైట్ల హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'వెంకీ'
  • రవితేజతో సాన్నిహిత్యాన్ని గురించిన ప్రస్తావన 
  • హీరోయిన్ అశిన్ డేట్స్ దొరకలేదని వెల్లడి
  • అందువలన స్నేహకి ఛాన్స్ వెళ్లిందని వ్యాఖ్య 


శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో 'వెంకీ' సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. రవితేజ - స్నేహ జంటగా నటించిన ఈ సినిమా, కథాకథనాల పరంగానే కాదు, మ్యూజికల్ హిట్ కూడా. కెరియర్ ఆరంభంలో శ్రీను వైట్లను నిలబెట్టిన సినిమాలలో ఇది ఒకటి. అలాంటి ఈ సినిమా విశేషాలను, తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల ప్రస్తావించాడు.

"రవితేజ - నేను కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాము. తనకి నేను 'ఆరంభం' అని ఒక కథ చెప్పాను. కానీ కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉండే కథ చేద్దామని అతను అన్నాడు. నేను కాకినాడకీ .. చెన్నైకి ట్రైన్ లో తిరుగుతూ ఉండేవాడిని. అలా ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్ లో ఒక అల్లరి జరిగింది. ఇలాంటి ఒక సీన్ చుట్టూ తిరిగే కథను రెడీ చేసుకోవాలని అనుకున్నాను. 

''అలా నేను తయారుచేసుకున్న కథనే 'వెంకీ'. ఈ కథను నేను రవితేజకి చెబితే చాలా బాగుందని అన్నాడు. అదే సమయంలో నిర్మాత పూర్ణచంద్రరావుగారు తారసపడటంతో ఆయనకి వినిపించాను. ఈ సినిమా నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చారు. కథానాయికగా ముందుగా అశిన్ ను అనుకున్నాము. ఆమె డేట్స్ కుదరకపోవడంతో, స్నేహను తీసుకున్నాము" అని చెప్పారు.

More Telugu News