Jagan: జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభం

CM Jagan Memantha Siddham bus yatra started

  • ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • 21 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర
  • ఈ రాత్రికి ఆళ్లగడ్డలో బస చేయనున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్... తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి, ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమయింది. 

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు కడప జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సీఎం చేరుకుంటారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి జగన్ బస చేస్తారు. 

Jagan
YSRCP
Memantha Siddham
Bus Yatra
AP Politics
  • Loading...

More Telugu News