AP CMO: సీఎం క్యాంప్ ఆఫీసుకు కంటైనర్.. ఎందుకొచ్చింది.. ఏం తెచ్చిందంటూ లోకేశ్ ప్రశ్న

Nara Lokesh Tweet

  • కంటైనర్ ను ఎందుకు తనిఖీ చేయలేదని నిలదీసిన లోకేశ్
  • ఆంధ్రప్రదేశ్ పోలీసులు జవాబు చెప్పాలని డిమాండ్
  • తన కాన్వాయ్ ను రోజూ తనిఖీ చేస్తున్నారని గుర్తుచేసిన యువనేత

ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే రోజూ తన కాన్వాయ్ ను తనిఖీ చేసే పోలీసులకు సీఎం క్యాంప్ ఆఫీసులోకి కంటైనర్ వెళ్లడం కనిపించలేదా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆ కంటైనర్ మిగతా వాహనాలలాగా కాకుండా రాంగ్ రూట్ లో వెళ్లడం, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎందుకొచ్చింది.. ఏం తెచ్చిందంటూ నిలదీశారు. ఇందులో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన పోలీసులకు కనిపించలేదా? అని ప్రశ్నించారు.

కంటైనర్ ను తనిఖీ చేయకపోవడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. అందులో ఏముంది..? బ్రెజిల్ సరుకా లేక లిక్కర్ లో మెక్కిన వేల కోట్ల డబ్బా? లేక లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా.. ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలన్నారు. ఏపీ సెక్రటేరియట్ లో ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లు తరలించారా.. ఏం చేశారో, కంటైనర్ లో ఏం తరలించారో ఏపీ డీజీపీ చెబుతారా? అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు.

More Telugu News