Ram Charan: ఓ రేంజ్ లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు... స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల

Special motion poster for Ram Charan birthday out now

  • రేపు రామ్ చరణ్ పుట్టినరోజు 
  • చాలా రోజుల ముందు నుంచే సంబరాలు
  • హైదరాబాదులో సుఖ్విందర్ సింగ్ సంగీత కచేరీ

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపు (మార్చి 27) పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే, చాలా రోజుల ముందే ఆయన జన్మదిన సంబరాలు షురూ అయ్యాయి. 

శ్రేయాస్ ఈవెంట్స్ సంస్థ రామ్ చరణ్ బర్త్ డేని పురస్కరించుకుని హైదరాబాదులో బాలీవుడ్ గాయకుడు సుఖ్విందర్ సింగ్ సంగీత కచేరీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సుఖ్విందర్ సింగ్ కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ చరణ్, సుఖ్విందర్ సింగ్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. 

ఇక, రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన మోషన్ పోస్టర్ నేడు రిలీజైంది. రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాల పోస్టర్లను ప్రదర్శిస్తూ దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు. 

ఇదంతా ఒకెత్తయితే... తన కుమారుడి పుట్టినరోజు కోసం కొణిదెల సురేఖ స్వయంగా 500 మందికి వండి అన్నదానం చేశారు. రుచికరమైన వంటకాలతో నేడు ఈ విందు ఏర్పాటు చేశారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్నారు. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కించనున్నారు. మరోవైపు వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నారు.

More Telugu News