Mahindra University: మహీంద్రా వర్సిటీకి భారీ మొత్తంలో నిధులు ప్రకటించిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra and family decides to allocate huge amount of funds to Mahindra University

  • 2020లో హైదరాబాదులో మహీంద్రా వర్సిటీ స్థాపన
  • 35 కోర్సులతో విద్యాబోధన
  • ఐదేళ్ల కాల వ్యవధిలో రూ.500 కోట్లు అందించాలని మహీంద్రా ఫ్యామిలీ నిర్ణయం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ వ్యాపార సంస్థ మహీంద్రా గ్రూప్ హైదరాబాదులో నాలుగేళ్ల కిందట మహీంద్రా యూనివర్సిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో 35 రకాల యూజీ, పీజీ, పీహెచ్ డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

త్వరలోనే ఇక్కడ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్, లిబరల్ ఆర్ట్స్ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. 

ఈ క్రమంలో, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. హైదరాబాదులోని మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్ల నిధులు అందించనున్నట్టు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో ఈ నిధులు అందిస్తామని, ఈ మేరకు తమ కుటుంబం నిర్ణయించిందని ఆనంద్ మహీంద్రా వివరించారు. 

అంతేకాదు, మహీంద్రా వర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు ప్రత్యేకంగా రూ.50 కోట్లు అందిస్తామని తెలిపారు.

More Telugu News