kadiyam kavya: కేసీఆర్‌ను కలిసిన వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య

Kadiyam Kavya meets kcr

  • హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసిన కడియం కావ్య
  • లోక్ సభ ఎన్నికల్లో అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన కావ్య
  • వరంగల్‌లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న కడియం కావ్య

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆమె అధినేతకు ధన్యవాదాలు తెలిపారు.  

పన్నెండు రోజుల క్రితం వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. దీంతో ఆమె జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె ఈరోజు కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్ గెలిచారు. ఈసారి ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

More Telugu News