Anjali Chakra: స్వలింగ ప్రేమికులు అంజలి చక్ర-సూఫీ మాలిక్ పెళ్లికి ముందు బ్రేకప్.. ఇంతకీ ఎవరు వీరు?

Anjali Chakra and Sufi Malik Same Sex Couple Break Up Before Wedding

  • తమ రిలేషన్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అంజలి-సూఫీ
  • పెళ్లికి కూడా రెడీ అయ్యాక షాకింగ్ నిర్ణయం
  • విడిపోవడానికి సూఫీనే కారణం
  • అంజలికి తాను తీరని ద్రోహం చేశానని అంగీకరించిన సూఫీ

సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు అంజలి చక్ర-సూఫీ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ స్వలింగ ప్రేమికులు పెళ్లికి కొన్ని రోజుల ముందు బ్రేకప్ చెప్పేసుకున్నారు. భారత్‌కు చెందిన అంజలి, పాకిస్థాన్‌కు చెందిన సూఫీ ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. సంవత్సరాలుగా వీరు స్వలింగ సంబంధం (సేమ్ సెక్స్ రిలేషన్)ను కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి పేరుతో ఒక్కటి కావాల్సిన ఈ జంట తాము బ్రేకప్ చెప్పేసుకున్నట్టు ఇన్‌స్టాలో ప్రకటించారు. వీరు విడిపోడానికి మాలికే కారణమని తెలుస్తోంది.

 ఈ స్వలింగ జంట 2019లో ఒక్కసారి వార్తల్లోకి ఎక్కారు. చాలా ఆసియా దేశాల్లో ‘ఎల్‌జీబీటీక్యూ ప్లస్’పై నిషేధం ఉన్న నేపథ్యంలో వీరి రిలేషన్‌షిప్ సంచలనమైంది. బ్రేకప్‌పై అంజలి స్పందిస్తూ.. తనవరకు ఇది షాకింగేనని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. పెళ్లిని రద్దు చేసుకోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నామని, సూఫీ అవిశ్వాసం కారణంగానే పెళ్లిని రద్దుచేసుకోవాలని, తమ సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్న అంజలి.. మాలిక్ విషయంలో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేసింది. మాలిక్ కూడా తమ బ్రేకప్‌పై స్పందించింది. తమ పెళ్లికి కొన్ని వారాల ముందు ఆమెను మోసం చేయడం ద్వారా తీరని ద్రోహం చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. తన అవగాహనకు మించి ఆమెను బాధించానని వాపోయింది. తప్పు తనదేనని అంగీకరించింది. అయితే, ఆ తప్పు ఎలాంటిదన్న విషయంలో స్పష్టత లేదు.

అంజలి చక్ర ఎవరు?
 భారత్‌కు చెందిన అంజలి చక్ర న్యూయార్క్‌లో ఉంటోంది. సదరన్ కాలిఫోర్నియా యూనిర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన అంజలి ఈవెంట్ ప్లానర్. కంటెంట్ క్రియేటర్ కూడా. పోస్టుగ్రాడ్యుయేషన్ తర్వాత కొన్నాళ్లు ఓ హెల్త్‌కేర్‌లో పనిచేసింది. ఆ తర్వాత ఈవెంట్ ప్లానింగ్ కోసం ఉద్యోగాన్ని వదులుకుంది.  

ఎవరీ సూఫీ మాలిక్

27 ఏళ్ల సూఫీ పాకిస్థాన్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఇస్లాం ఆధ్యాత్మిక కోణమైన సూఫీ తత్వశాస్త్రం నుంచి ప్రేరణ పొంది తన పేరుకు ముందు సూఫీ అని చేర్చుకుంది. ఫొటోగ్రఫీ అంటే మక్కువ. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో ఉంటోంది. అక్కడి నుంచే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ట్రావెలింగ్‌పై కంటెంట్ షేర్ చేస్తూ ఉంటుంది. అంజలితో స్నేహం తర్వాత ఆమె ఫేమస్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరి ఫొటోలు షేర్ చేస్తూ, ఎల్‌జీబీటీక్యూ ప్లస్‌కు ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరికీ కలిపి ఒక యూట్యూబ్ చానల్ ‘సూఫీ అండ్ అంజలి’ ఉంది.

  • Loading...

More Telugu News