Radha: ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాధ!

Alitho Saradaga Radha Episode

  • ఇటీవలే మొదలైన 'ఆలీతో సరదాగా 2'
  • ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే రాధ ఎపిసోడ్ 
  • యాక్టివ్ గా సమాధానాలు చెబుతూ వచ్చిన రాధ
  • పిల్లల విషయంలో ఎమోషనలైన రాధ - అలీ


ఈటీవీలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి చాలా క్రేజ్ ఉంది. చాలామంది ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండేవారు. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకుని, రీసెంటుగా సెకండ్ సీజన్ ను మొదలుపెట్టారు. హీరో గోపీచంద్ .. హీరో శివాజీ తరువాత సీనియర్ హీరోయిన్ రాధను ఇంటర్వ్యూ చేశారు. అందుకు సంబంధించిన 'ప్రోమో' ఎయిర్ అవుతోంది. 

రాధ స్కూల్ డేస్ .. ఆమె సినిమా ప్రయాణం .. ఆమెకి ఇష్టమైన హీరో .. డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకోవడం .. వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్నలను అలీ అడిగినట్టుగా ప్రోమోను బట్టి తెలుస్తోంది. రాధా ఇప్పటికీ అంతే యాక్టివ్ గా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. సమయస్ఫూర్తితో ఆమె చెప్పిన సమాధానాలు ఈ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. 

ఇక పిల్లల పెళ్లిళ్లు .. అప్పటివరకూ వాళ్లని పెంచి పెద్ద చేస్తూ రావడం .. పెళ్లి పేరుతో వాళ్లు దూరం కావడం వంటి అంశాల ప్రస్తావన వచ్చినప్పుడు రాధ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలీ కూడా ఉద్వేగానికి లోనవ్వడం .. ఒకరిని ఒకరు ఓదార్చుకోవడంతో ఈ ఎపిసోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ కానుంది. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. 

Radha
Ali
Alitho Saradaga
Interview
  • Loading...

More Telugu News