Keerthi Suresh: ఓటీటీ సెంటర్ కి కీర్తి సురేశ్ - జయం రవి మూవీ!

Siren Movie OTT release date confirmed

  • ఫిబ్రవరి 16న విడుదలైన 'సైరన్'
  • తమిళ థియేటర్ల నుంచి సక్సెస్ టాక్ 
  • ముఖ్యమైన పాత్రల్లో మెప్పించిన కీర్తి - అనుపమ 
  • ఏప్రిల్ 11 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 


తమిళంలో జయం రవికి మంచి క్రేజ్ ఉంది. 'పొన్నియిన్ సెల్వన్' తరువాత ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ఆయన నుంచి ఇటీవల 'సైరన్' సినిమా వచ్చింది. సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, ఆంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 16వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, సక్సెస్ టాక్ తెచ్చుకుంది. 

అలాంటి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో, కీర్తి సురేశ్ - అనుపమ పరమేశ్వరన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కీర్తి సురేష్ కి తను పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. 

తన భార్యను హత్య చేసిన కేసులో హీరో జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. పెరోల్ పై వచ్చిన అతణ్ణి కూతురు అసహ్యించుకుంటుంది. అలా పెరోల్ పై వచ్చిన అతను మరో రెండు మర్డర్లు చేస్తాడు. ఆధారాలు లేకుండా జాగ్రత్తపడతాడు. అతను నేరస్థుడని నిరూపించడానికి నందిని (కీర్తి సురేశ్) రంగంలోకి దిగుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? హీరో భార్యను ఎవరు చంపారు?అనేది మిగతా కథ. 

More Telugu News