Family Star: 'మధురము కదా...' విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' నుంచి మరో సింగిల్ విడుదల

Another single from Vijay Devarakonda Family Star out now

  • విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్'
  • పరశురాం దర్శకత్వంలో చిత్రం
  • ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియో రిలీజైంది. 'మధురము కదా' అంటూ సాగే ఈ పాటకు గోపీసుందర్ బాణీలు అందించారు. శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్ ఆలపించారు. 'గీతగోవిందం' చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో 'ఫ్యామిలీ స్టార్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

More Telugu News