Arjun Ambati: 'విరూపాక్ష' నేను చేయవలసిన సినిమా : నటుడు అర్జున్ అంబటి

Arjun Ambati Interview

  • బిగ్ బాస్ తో అర్జున్ అంబటికి గుర్తింపు 
  • తనకి సినిమా నేపథ్యం లేదని వ్యాఖ్య  
  • అప్పటి 'శాసనం'  .. ఆ తరువాత 'విరూపాక్ష'అని వెల్లడి
  • ఇకపై స్పీడ్ పెంచుతానని వివరణ


'బిగ్ బాస్' సీజన్ 7 చూసినవారికి అర్జున్ అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఫైనల్స్ వరకూ వెళ్లగలిగాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసినవాళ్లుంటే ఎదగడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కానీ నాకు అలాంటివారెవరూ లేరు. నాకు నేనుగా నిరూపించుకోవాలి .. నిలదొక్కుకోవాలి" అని అన్నాడు. 

"కెరియర్ తొలినాళ్లలో నేను 'అర్ధనారి' అనే సినిమా చేశాను. అలాంటి కంటెంట్ ను సాధారణంగా ఎవరూ టచ్ చేయరు. కానీ అలాంటి ఒక కంటెంట్ ను చేస్తేనే మన గురించి నలుగురూ మాట్లాడుకుంటారని చేశాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను .. చాలా బాగా వచ్చింది. కానీ ఆ పాత్రను చేసింది నేను అని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎవరూ కూడా గుర్తుపట్టలేదు" అని చెప్పాడు.   

"మొదటి నుంచి కూడా నాది చొచ్చుకుని వెళ్లే స్వభావం కాదు. నాకు బాగా పరిచయముంటేనే ఎవరితోనైనా మాట్లాడతాను .. లేదంటే లేదు. ఇక్కడ పరిచయాల వలన ఎక్కువ అవకాశాలు వస్తాయి. పరిచయాలు ఎక్కువగా లేకపోవడం నా వైపు నుంచి ఒక లోపంగా నేను భావిస్తూ ఉంటాను. కార్తీక్ దండు 'విరూపాక్ష' సినిమాను నాతో చేయాలనుకున్నాడు. అప్పుడు అనుకున్న టైటిల్ 'శాసనం'. కానీ అప్పుడు మాకు ప్రొడ్యూసర్ దొరకలేదు. ఇక నాకు నచ్చిన కథలను ఎంచుకుంటూ, స్పీడ్ పెంచాలని అనుకుంటున్నాను" అని అన్నాడు.   

Arjun Ambati
Actor
Interview
  • Loading...

More Telugu News