Sanju Samson: సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు

RR scores 193 runs with captain Sanju Samson super knock
  • జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ పోరు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు
  • 52 బంతుల్లో 82 పరుగులు బాదిన శాంసన్
నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనుండగా, తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. జైపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సంజు శాంసన్ దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. 

సంజు శాంసన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో అజేయంగా 82 పరుగులు చేయడం విశేషం. యువ బ్యాట్స్ మన్ రియాన్ పరాగ్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా మెరుపులు మెరిపించాడు. పరాగ్ 29 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. 

టీమిండియా కొత్త వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా బ్యాట్ ఝళిపించాడు. జురెల్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 24, జోస్ బట్లర్ 11 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీనుల్ హక్ 2, మొహిసిన్ ఖాన్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.
Sanju Samson
Rajasthan Royals
Lucknow Supergiants
Jaipur
IPL 2024

More Telugu News