Pithapuram: పవన్ కల్యాణ్ ను కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ

Pithapuram TDP incharge SVSN Varma met Pawan Kalyan
  • మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చిన వర్మ
  • పవన్ కల్యాణ్ తో మర్యాదపూర్వక భేటీ
  • భేటీలో పాల్గొన్న టీడీపీ నేత సుజయ కృష్ణ రంగారావు 
జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 

కాగా, ఇవాళ పవన్ ను పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్, వర్మ భేటీ జరిగింది. ఈ మర్యాదపూర్వక సమావేశంలో టీడీపీ నేత సుజయ కృష్ణ రంగారావు కూడా పాల్గొన్నారు. 

వాస్తవానికి, పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ భావించారు. కానీ, పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. ఇక్కడ్నించి బరిలో దిగుతున్నట్టు పవన్ ప్రకటించగా, వర్మ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చచెప్పడంతో వర్మ శాంతించారు. ఈ నేపథ్యంలో, పవన్ తో నేడు వర్మ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Pithapuram
Pawan Kalyan
SVSN Varma
TDP-JanaSena-BJP Alliance

More Telugu News