Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

EC notices to Nara Bhuvaneshwari

  • నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు
  • నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని ఆరోపణ
  • ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులను కలిసి నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. 

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి అప్పట్లో పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు.

Nara Bhuvaneswari
State Election Commission
Election Code Violation
Nijam Gelavali Yatra
Telugudesam
AP Assembly Polls
  • Loading...

More Telugu News