Chandrababu: పురందేశ్వరి నా కుటుంబ సభ్యురాలే కావొచ్చు... కానీ...!: చంద్రబాబు
- పురందేశ్వరి రాజీనామా అంటూ ఫేక్ లెటర్
- విజయవాడ పోలీసులకు ఏపీ బీజేపీ ఫిర్యాదు
- వైసీపీ చేసే ప్రతి పని ఫేక్ అంటూ చంద్రబాబు విమర్శలు
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా అంటూ ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర బీజేపీ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ సోషల్ మీడియా వారికే ఇలాంటి ఫేక్ లెటర్లు వ్యాప్తి చేసే అవసరం ఉందని తన ఫిర్యాదులో పేర్కొంది.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ చేసే ప్రతి పని ఫేక్ అని ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేశారని ఫేక్ లెటర్ తో ప్రచారం చేశారు, ఇది టెంపరరీ పొత్తు అని నా పేరుతోనూ ఫేక్ లెటర్లు వదిలారు అని చంద్రబాబు మండిపడ్డారు.
"దగ్గుబాటి పురందేశ్వరి నా కుటుంబానికి చెందిన వ్యక్తే కావొచ్చు... కానీ ఆమె 30 ఏళ్లుగా ఇతర పార్టీల్లో ఉన్నారు. ఆమె విషయంలో అనేక ఫేక్ వార్తలు తీసుకువచ్చారు. జనసేన, పవన్ కల్యాణ్ పైనా ఫేక్ వార్తలు వచ్చాయి" అని చంద్రబాబు వివరించారు.