Lalu Prasad Yadav: కిడ్నీ ఇచ్చినందుకే కూతురికి లాలూ టికెట్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్య

Samrat choudharys controversial remarks against rjd chief lalu prasad yadav

  • ఆర్జేడీ అధినేత లాలూ టికెట్లు అమ్ముకోవడంలో దిట్ట అని వ్యాఖ్య
  • చివరకు కన్నకూతురు రోహిణినీ వదిలిపెట్టలేదని ఆరోపణ
  • లాలూకు గతంలో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స

బీహార్‌లో రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టికెట్లు అమ్ముుకోవడంలో లాలూ దిట్ట అని, ఆయన తన కుమార్తెను కూడా విడిచిపెట్టలేదని ఆరోపించారు. తనకు కిడ్నీ ఇచ్చిన కూతురు రోహిణికి ప్రతిఫలంగా అసెంబ్లీ టికెట్ కేటాయిస్తున్నారని ఆరోపించారు. లాలూ ఇద్దరు కుమార్తెలూ ఎన్నికల బరిలోకి దిగుతారన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా, లాలూకు గతంలో సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.

More Telugu News