Yamini: మా ఊరు పేరు చెబితే చాలు .. ఇంటివరకూ వచ్చేస్తున్నారు: యూ ట్యూబర్ యామిని

Yamini Special

  • యూ ట్యూబర్ గా యామినీకి మంచి పేరు  
  • సంప్రదాయ దుస్తుల్లో మెరవడం ఆమె ప్రత్యేకత 
  • సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయని వెల్లడి 
  • తన ఇంటికి రావడానికి ట్రై చేయవద్దని విన్నపం 
  • విదేశాల్లో ఎమ్మెస్ చేయనున్నట్టు వివరణ


యూ ట్యూబ్ ను తరచూ చూసేవారికి ఇ.ఆర్. యామినీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. ఇవి మాత్రమే కాదు .. నిర్మలమైన .. నిష్కల్మషమైన ఆమె నవ్వుకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఆమెను ఇంతమంది ఇంతగా అభిమానించడానికి కారణం, తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే ఆమె వేషధారణ. ఒక సీరియల్ మాదిరిగా .. ఒక వెబ్ సిరీస్ సీజన్ల మాదిరిగా ఆమె వీడియోస్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యామినీ మాట్లాడుతూ .. " మదనపల్లి .. తిరుపతిలలో నా చదువు కొనసాగింది. ఇంటర్ - బీటెక్ తిరుపతిలో పూర్తిచేశాను. ఇక మా సొంత ఊరు ఎక్కడనేది మాత్రం చెప్పను. ఎందుకంటే మా ఊరు పేరు చెప్పడమే ఆలస్యం .. మా ఇంటివరకూ వచ్చేస్తున్నారు. దాంతో మాకు ఇబ్బంది అవుతోంది. అందువలన నా కోసం మా ఇంటికి రావొద్దని ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను కోరుతున్నాను" అని అన్నారు. " నేను యూ ట్యూబ్ వీడియోస్ 2018 నుంచి చేయడం మొదలుపెట్టాను .. కానీ పోస్టు చేయలేదు. మూడేళ్ల తరువాత మా మదర్ - ఫాదర్ పర్మిషన్ తీసుకుని పోస్ట్ చేశాను. ఇక అప్పటి నుంచి నాకు గుర్తింపు రావడం మొదలైంది. మొదటిసారిగా 'చిలకపచ్చ చీర' అనే సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ పాట చాలా పాప్యులర్ అయింది. దాంతో నాకు సినిమాల నుంచి ఆఫర్లు రావడం మొదలైంది. నాకు సినిమాల్లో చేయాలనే ఉంది. కానీ కథ .. నా పాత్ర .. ఇప్పుడున్న ఇమేజ్ ను కాపాడేవిగా ఉండాలనేది నా కోరిక" అని చెప్పారు. 

" మొదటి నుంచి కూడా లంగావోణీ .. చీరలు అంటే ఇష్టపడతాను. అందువలన వాటినే ఎక్కువగా ధరిస్తూ ఉంటాను. హైదరాబాద్ లో ఒక ఏడాది జాబ్ కూడా చేశాను. యూఎస్ లో ఎమ్మెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లిన తరువాత కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను" అని అన్నారు. 

  • Loading...

More Telugu News