mallu ravi: సంపత్ కుమార్ ఇంటికి వెళ్లిన మల్లు రవి... శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పిన సంపత్ కుమార్

Mallu Ravi meets Sampath Kumar

  • నాగర్ కర్నూల్ లోక్ సభకు కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న మల్లు రవి
  • ఈ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సంపత్ కుమార్
  • సంపత్ ఇంటికి వెళ్లి, మద్దతు కోరిన మల్లు రవి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంపత్ కుమార్‌తో నాగర్‌కర్నూల్ లోక్ సభ అభ్యర్థి మల్లు రవి శుక్రవారం భేటీ అయ్యారు. మల్లు రవిని అభ్యర్థిగా నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నాగర్ కర్నూల్ లోక్ సభ టిక్కెట్ కోసం సంపత్ కుమార్ కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో సంపత్ కుమార్ ఇంటికి వెళ్లిన మల్లు రవి తనకు మద్దతివ్వాలని కోరారు. ఇంటికి వచ్చిన మల్లు రవిని సంపత్ సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు. అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ మాదిగలకు న్యాయం చేస్తుంది

కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తుందని సంపత్ కుమార్ అన్నారు. మాదిగల కోసం లోకూర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుంచుకోవాలన్నారు. 2014 కంటే ముందే ఎస్సీ వర్గీకరణ చేయడానికి పార్టీ ముందుకు వచ్చిందని గుర్తు చేశారు.

More Telugu News