Pushpak: ఇస్రో పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం

Isro successfully lands Pushpak Indias 1st Reusable Launch Vehicle

  • కర్ణాటకలోని చిత్రదుర్గలోగల ఏయిరోనాటికల్ టెస్టింగ్ రేంజ్‌లో ప్రయోగం 
  • ప్రయోగ ప్రమాణాలకు అనుగుణంగా రన్‌వేపై ల్యాండింగ్
  • రాకెట్ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర అంతరిక్ష యానం అభివృద్ధి లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు

దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ (విమానం తరహా రెక్కలు ఉన్న..) రాకెట్ పుష్పక్‌ను ఇస్రో నేడు విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోగల ఏయిరోనాటికల్ టెస్టింగ్ రేంజ్‌లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వే‌పై ల్యాండైంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇస్రో చైర్మన్ కూడా హాజరయ్యారు. అంతరిక్ష రంగంలో సుస్థిరత‌, వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్దకాలంగా పుష్పక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది సింగిల్ స్టేజ్ టూ ఆర్బిట్ రాకెట్. అంటే..పీఎస్‌ఎల్‌వీ లాగా వివిధ దశలకు బదులు ఒకే దశలో కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇందులో అత్యాధునిక ఎక్స్-33 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్, ఎక్స్-34 టెస్ట్‌బెడ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్, ఆధునికీకరించిన డీసీ-ఎక్స్ఏ ఫ్లైట్ డెమాన్‌స్ట్రేటర్ ఉన్నాయి. 

పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయింది. దీంతో, ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది. ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు, వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది. 
 
రూ. 100 కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది. 2012లో ఈ రాకెట్ డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్‌వీ-టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది. ఈ రాకెట్‌ సామర్థ్యాలను 2016లో తొలిసారిగా పరీక్షించారు. పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో చెబుతోంది.

  • Loading...

More Telugu News