Janasena: జనసేన 'జంగ్ సైరన్' పాట విడుదల... అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన జానీ మాస్టర్

Janasena releases election campaign song

  • ఎన్నికల ప్రచార గీతాన్ని తీసుకువచ్చిన జనసేన పార్టీ
  • జంగ్ సైరన్ పాటను ఆలపించిన నల్గొండ గద్దర్ నరసన్న
  • ఉర్రూతలూగించిన జానీ మాస్టర్

జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం గీతం జంగ్ సైరన్ నేడు విడుదలైంది. నల్గొండ గద్దర్ గా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు నరసన్న ఈ హుషారైన గీతాన్ని ఆలపించారు. ఇందులో, ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. జనసేన, పవన్ కల్యాణ్ లను హైలైట్ చేస్తూ, విప్లవతేజం చేగువెరాను ప్రస్తావిస్తూ ఈ జంగ్ సైరన్ పాట సాగుతుంది. నల్గొండ గద్దర్ నరసన్న గళం, ఉర్రూతలూగించేలా జానీ మాస్టర్ స్టెప్పులతో ఈ ఎన్నికల గీతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కొద్దిసేపటి కిందటే ఈ పాటను జనసేన పార్టీ విడుదల చేయగా, లక్ష వ్యూస్ సాధించింది.

More Telugu News