Volunteers: రాజమండ్రిలో 23 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు

23 volunteers suspended in Rajahmundry

  • వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు
  • సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
  • నిన్న కూడా 45 మంది వాలంటీర్ల తొలగింపు

రాజమండ్రి పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వీరిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీరిని సస్పెండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలువురు వాలంటీర్లు వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న కూడా 45 మంది వాలంటీర్లను తొలగించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో వీళ్లు పాల్గొన్నారు.

Volunteers
Suspension
Rajahmundry
YSRCP
  • Loading...

More Telugu News