Priyanka Chopra: అయోధ్య రాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా.. వీడియో ఇదిగో!

Priyanka Chopra Offers Prayers At Ayodhya Ram Mandir With Nick And Malti

  • కూతురు మాల్టీ, భర్త నిక్ తో కలిసి ఆలయ సందర్శన
  • మాల్టీతో అయోధ్య అని పలికించిన నటి
  • ముంబైలో ఈవెంట్ కోసం ఇండియాకు వచ్చిన దంపతులు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బుధవారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కోసం ఇటీవల ఇండియా వచ్చిన ఈ జంట.. బుధవారం అయోధ్యకు వచ్చారు. సంప్రదాయ చీరలో ప్రియాంక, కుర్తా పైజామా ధరించి నిక్ జోనస్ ఆలయానికి చేరుకున్నారు. రామయ్య దర్శనం, పూజల తర్వాత ఆలయ పూజారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. పూజారుల ఆశీస్సులు తీసుకున్నాక వారితో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. అయోధ్య ఎయిర్ పోర్ట్ లో దిగాక రెండేళ్ల వయసున్న తన కూతురు మాల్టీతో ప్రియాంక ‘అయోధ్య’ అని పలికించడం వీడియోలో కనిపించింది. 

ఈ ఏడాది జనవరి 22 న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భక్తుల కోసం గుడి తలుపులు తెరిచిన నాటి నుంచి చాలా మంది ప్రముఖులు కుటుంబ సమేతంగా బాలక్ రామ్ ను దర్శించుకున్నారు. ఇటీవలే అలియా భట్ రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ కత్రినా కైఫ్, రిషబ్ షెట్టి తదితరులు అయోధ్య రాముడిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు. తాజాగా ప్రియాంక, నిక్ జోనస్ దంపతులు ఆలయాన్ని సందర్శించారు. కాగా, మంగళవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక.. తన కొత్త ప్రాజెక్ట్ ‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ డాక్యుమెంటరీ వివరాలను మీడియాతో పంచుకున్నారు.

More Telugu News