Kakinada Murders: అక్రమ సంబంధం పెట్టుకుందని మహిళ హత్య.. కాకినాడలో జంట హత్యల కలకలం

Double Murder In Kakinada Rural village

  • సహజీవన భాగస్వామిని, ఆమె ప్రియుడిని చంపేసిన యువకుడు
  • మరో మహిళ పైనా కత్తితో దాడి.. సీరియస్ గా మహిళ పరిస్థితి
  • కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్న కాకినాడ పోలీసులు

ఓవైపు తనతో సహజీవనం చేస్తూనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఇద్దరినీ రెడ్ హాండెడ్ గా పట్టుకుని కత్తితో దాడి చేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోగా.. ఈ అక్రమ సంబంధానికి సహకరించిందనే ఉద్దేశంతో ఓ వృద్ధురాలి తల్లిపైనా దాడి చేశాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివార్లలో చోటుచేసుకుందీ ఘోరం. పోలీసులు, గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం..

చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోవమ్మ, లోక నాగబాబు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అయితే, ఇటీవల పోసిన శ్రీనుతో లోవమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం తెలియడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శ్రీను, లోవమ్మలపై కత్తితో పొడిచి చంపేశాడు. అక్రమ సంబంధానికి సహకరించిందనే ఉద్దేశంతో లోవమ్మ తల్లి రామలక్ష్మిపైనా నాగబాబు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రామలక్ష్మిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Kakinada Murders
Double Murder
Crime News
Andhra Pradesh
  • Loading...

More Telugu News