Etela Rajender: రేవంత్ రెడ్డీ.. మల్కాజ్‌గిరి వాడినే నిలబెట్టు, లేదంటే నీ సంగతి చెబుతా: ఈటల రాజేందర్ హెచ్చరిక

Etala Rajender warning to CM Revanth Reddy

  • తనకు మల్కాజ్‌గిరితో ఏం సంబంధమని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడని ఆగ్రహం
  • ఆయన కూడా ఈ ప్రాంతం వాడినే అభ్యర్థిగా నిలబెట్టాలని సవాల్
  • బయటి వ్యక్తిని నిలబెడితే ఊరుకునేది లేదన్న ఈటల రాజేందర్

'నాకు మల్కా‌జ్‌గిరితో ఏం సంబంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు... అలాంటప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ప్రాంతం వాడినే నిలబెట్టాలి... లేదంటే ఆయన సంగతి చెబుతా'నని బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరి ప్రాంతం వాడినే తనపై పోటీకి నిలపాలని సవాల్ చేశారు.

ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... 'మ‌ల్కాజ్‌గిరితో నాకు ఏం సంబంధం? అని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి నేను ఓ సవాల్ విసురుతున్నాను... నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం వ్యక్తినే నాపై పోటీకి నిలుపు' అన్నారు. బయటి వ్యక్తిని నిలబెడితే ఊరుకునేది లేదన్నారు. రేవంత్ రెడ్డి అభ్య‌ర్థి కోసం వెతుకుతున్నాడని... రూ.200 కోట్లు ఖ‌ర్చు పెట్టే అభ్యర్థి వారికి కావాలట అని ఎద్దేవా చేశారు. ఈట‌ల రాజేంద‌ర్‌ను త‌ట్టుకోవాలంటే రూ.400 కోట్లు ఖ‌ర్చు పెట్టే వ్యక్తి కావాలని పేర్కొన్నారు.

Etela Rajender
Revanth Reddy
BJP
Lok Sabha Polls
  • Loading...

More Telugu News