Thulasivanam: రొమాంటిక్ కామెడీ జోనర్లో 'తులసీవనం' .. ఈటీవీ విన్ లో!

Thulasivanam Web Series Update

  • తరుణ్ భాస్కర్ సమర్పణలో 'తులసీవనం' 
  • ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్న స్ట్రీమింగ్
  • సంగీతాన్ని సమకూర్చిన స్మరణ్
  • లవ్ .. కామెడీ ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కంటెంట్   


ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పలకరించనుంది. ఆ రొమాంటిక్ ఎంటర్టైనర్ పేరే 'తులసీవనం'. అక్షయ్ .. ఐశ్వర్య .. వెంకటేశ్ కాకుమాను .. విష్ణు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి అనిల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్ ఈ సిరీస్ ను సమర్పిస్తున్నాడు.

ఈ సిరీస్ ను ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ఈటీవీ విన్ నుంచి వచ్చేసింది. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఫ్రెండ్షిప్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, స్ట్రీట్ క్రికెట్ నేపథ్యాన్ని కూడా తోడుగా చేసుకుని ఈ సిరీస్ నడుస్తుంది. స్మరణ్ అందించిన సంగీతం ఈ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. 

స్వాగత్ రెడ్డి - నీలిత పైడిపల్లి ఈ సిరీస్ ను నిర్మించారు. ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ వెబ్ సిరీస్ ల విషయంలో కాస్త జోరు పెంచడం కనిపిస్తోంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కంటెంట్ ను కూడా ట్రాక్ పైకి తీసుకొస్తోంది. ఈ సిరీస్ ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి.

Thulasivanam
Akshay
Aishwarya
Vishnu
Anil Reddy
  • Loading...

More Telugu News