Tripthi Dimri: హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి .. అందానికి తోడైన అదృష్టం!

Tripthi DimriSpecial

  • 'యానిమల్'లో మెరిసిన అందం త్రిప్తి డిమ్రి
  • ఆ మూవీతో సోషల్ మీడియాలో పెరిగిపోయిన ఫాలోవర్స్
  • పాన్ ఇండియా స్థాయిలో లభించిన క్రేజ్ 
  • టాలీవుడ్ నుంచి క్యూ కడుతున్న అవకాశాలు


ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు క్రేజ్ వస్తుందో .. ఎవరు ఎప్పుడు పాప్యులర్ అవుతారనేది ఎవరికీ తెలియదు. సరైన సినిమా .. సరైన పాత్ర పడితే చాలు, ఆ తరువాత ఎక్కడ చూసినా వాళ్లను గురించి మాట్లాడుకునేవారు కనిపిస్తారు. ఎవరు ఎక్కడ మాట్లాడుకుంటున్నా అక్కడ వారి పేరే వినిపిస్తూ ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో చాలామంది నోటి నుంచి వినిపించిన పేరు 'త్రిప్తి డిమ్రి'.'యానిమల్' సినిమా రావడానికి ముందు ఈ సుందరి పేరు చాలామందికి పెద్దగా తెలియదు. ఆ తరువాత ఈ బ్యూటీ గురించి తెలియని వారు లేరు. అంతగా ఆమె తన పాత్ర ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ సీన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. చక్కని కనుముక్కుతీరుతో .. గ్లామర్ పరంగా కుర్రాళ్ల మనసులను దోచేసింది. ఈ సినిమా తరువాత సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది.ఇటీవలే బాలీవుడ్ నుంచి వచ్చిన ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్స్ తో ఇక్కడ దూసుకుపోతోంది. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలోను కనిపించనుంది. అలాగే త్రిప్తి డిమ్రిని రంగంలోకి దింపడానికి ఇక్కడి మేకర్స్ పోటీపడుతున్నారు. ఆల్రెడీ రవితేజ - అనిల్ రావిపూడి సినిమా కోసం, విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ఆమె ఎంపిక జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక కొంతమంది తమ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఆమె ఉండాల్సిందే అనే ఉద్దేశంతో గట్టిగానే సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి. 

More Telugu News