Mamitha Baiju: యూత్ ఫేవరేట్ క్రష్ మమిత బైజు .. టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు!

Mamitha Baiju Special

  • మలయాళ నాయికగా మమిత బైజు 
  • 'ప్రేమలు' తెచ్చిపెట్టిన స్టార్ స్టేటస్
  • 'రీను' పాత్రలో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ  
  • టాలీవుడ్ నుంచి వెళుతున్న ఆఫర్లు


ఇప్పుడు సౌత్ సినిమాలన్నీ ఒకే ఫ్రేమ్ లో నడుస్తున్నాయి. కొత్త హీరోయిన్ ఎక్కడ ఎంట్రీ ఇచ్చినా .. ఏ హీరోయిన్ ఎక్కడ సూపర్ హిట్ అందుకున్నా, ఇతర భాషల నుంచి వెంటనే అవకాశాలు వచ్చిపడుతూనే ఉన్నాయి. కొంతమంది హీరోయిన్స్ కాలు పెడుతూనే హిట్ కొట్టేస్తారు. మరికొంతమందికి మాత్రం సరైన హిట్ పడటానికీ .. స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి కొంత సమయం పడుతుంది.అలా కొంత సమయాన్ని తీసుకున్న హీరోయిన్స్ జాబితాలోనే మమిత బైజు కనిపిస్తుంది. మమిత బైజు .. ఇప్పుడు కుర్రాళ్లంతా జపిస్తున్న పేరు .. తపిస్తున్న పేరు. రీసెంటుగా విడుదలైన 'ప్రేమలు' ఆమెకి ఈ స్థాయి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి ముందే ఈ బ్యూటీ 15 సినిమాల వరకూ చేసింది. కానీ ఆమెను స్టార్ ను చేసింది మాత్రమే ఈ సినిమానే. ఈ సినిమాలో ఆమె పోషించిన 'రీను' పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.మమిత ఈ సినిమాలో తన చలాకి నటనతో కుర్రాళ్ల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ కుర్రాళ్లు హారతులు పడుతుండటం ఆశ్చర్యం. మమిత క్రేజ్ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండటంతో, టాలీవుడ్ నుంచి ఆమెకి వరుస ఆఫర్లు వెళుతున్నాయని వినికిడి. త్వరలోనే తెలుగు ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించే అవకాశం లేకపోలేదు. 

Mamitha Baiju
Premalu
Naslen
Girish
  • Loading...

More Telugu News