Ravichandran Ashwin: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ టికెట్ల కోసం రవిచంద్రన్ అశ్విన్ తంటాలు..!
![Ravichandran Ashwin asks CSK Management for Help Regarding IPL 2024 Opener Tickets](https://imgd.ap7am.com/thumbnail/cr-20240318tn65f814e8062ae.jpg)
- ఈ నెల 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్
- ప్రారంభ మ్యాచ్‌కు టికెట్లకు విపరీతమైన డిమాండ్
- మ్యాచ్ టికెట్ల కోసం సీఎస్కే యాజమాన్యం సాయం కోరిన అశ్విన్
మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. ఈ నెల 22వ తేదీన జరిగే ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ మొదలవగా భారీ డిమాండ్ నెలకొంది. అయితే, ప్రారంభోత్సవ వేడుకతో పాటు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని తన పిల్లలు కోరుకుంటున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. కానీ, విపరీతమైన డిమాండ్ కారణంగా టికెట్స్ దొరకలేదని వాపోయాడు. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యం కల్పించుకుని సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇక అశ్విన్ విజ్ఞప్తిపై సీఎస్కే యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా, అశ్విన్ ఇంతకుముందు చాలా ఏళ్లు చెన్నై జట్టుకే ఆడిన విషయం తెలిసిందే. సీఎస్కే వదిలిపెట్టడంతో రాజస్థాన్ రాయల్స్‌కు మారాడు.