Vijay Mallya: ఆర్‌సీబీ విజ‌యంపై విజ‌య్ మాల్యా ట్వీట్.. 'అమ్మాయిలు సాధించారు.. కంగ్రాట్స్'..!

Vijay Mallya Congratulates RCB for Winning WPL 2024

  • అమ్మాయిలు అద్భుతం చేశారంటూ మాల్యా కితాబు
  • ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ కూడా గెలిస్తే బాగుంటుంద‌న్న లిక్క‌ర్ కింగ్ 
  • డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌ విజ‌యంతో ఆర్‌సీబీ అభిమానుల్లో జోష్‌

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ ఓన‌ర్ విజ‌య్ మాల్యా.. ఆదివారం డ‌బ్ల్యూపీఎల్ 2024 టైటిల్ సాధించిన అమ్మాయిల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా కంగ్రాట్స్ చెప్పాడు. స్మృతి మంధాన సారథ్యంలో జ‌ట్టు అద్భుతం చేసింద‌ని, స‌భ్యులంద‌రికీ విషెస్ తెలియ‌జేశాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్‌సీబీ చిత్తుచేసి క‌ప్ గెల‌వడం ప‌ట్ల మాల్యా హ‌ర్షం వ్యక్తం చేశాడు. 

ఈ సందర్భంగా త‌న సోష‌ల్ మీడియా పోస్టులో.. "డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచినందుకు ఆర్‌సీబీ మ‌హిళ‌ల జ‌ట్టుకు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ఇక చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ టైటిల్ కూడా ఈసారి ఆర్‌సీబీ ప‌రుషుల జ‌ట్టు గెలిస్తే బాగుంటుంది. ఒకే ఏడాది డ‌బుల్ టైటిల్ సాధించిన‌ట్లు అవుతుంది. గుడ్‌ల‌క్" అని రాసుకొచ్చాడు. ఇదిలాఉంటే.. బెంగ‌ళూరు మ‌హిళల జ‌ట్టు క‌ప్పు గెల‌వ‌డం ప‌ట్ల ఆర్‌సీబీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 16 ఏళ్ల ఎదురుచూపుల‌కు అమ్మాయిలు తెరదించార‌ని వారు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ కూడా గెలవాల‌ని వారు కోరుకుంటున్నారు.

More Telugu News