Singer Mangli: గాయని మంగ్లీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

Singer Mangli escape accident with minor injuries

  • శనివారం రాత్రి ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగివస్తున్న సమయంలో ప్రమాదం
  • హైదరాబాద్-బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం
  • మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
  • డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడన్న పోలీసులు 

ప్రముఖ గాయని మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. ఆ తరువాత అర్ధరాత్రి తిరిగొస్తుండగా డీసీఎం వారి కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో మంగ్లీతో పాటు కారులోని మేఘరాజ్, మనోహర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం కూడా దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 


More Telugu News