K Kavitha: కాసేపట్లో కవితను కలవనున్న కేటీఆర్, హరీశ్ రావు

KTR and Harish Rao to meet Kavitha

  • లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కవిత
  • కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలవడానికి కోర్టు అనుమతి
  • సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవితను కలవనున్న కేటీఆర్, హరీశ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధించారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు, ఆమె న్యాయవాదులు కలవడానికి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో కవితను ఆమె సోదరుడు కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు కాసేపట్లో కలవనున్నారు. కవితను కలిసేందుకు ఈ మధ్యాహ్నం కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. 

K Kavitha
KTR
Harish Rao
BRS
Enforcement Directorate
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News