Narendra Modi: కాసేపట్లో గన్నవరంకు మోదీ.. సిద్దంగా ఉన్న నాలుగు హెలికాప్టర్లు

We will develop AP says Modi

  • 4.10 గంటకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోదీ
  • అక్కడి నుంచి ప్రజాగళం సభకు హెలికాప్టర్ లో వెళ్లనున్న మోదీ
  • సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఎన్ఎస్జీ సిబ్బంది

ఇప్పుడు అందరి దృష్టి చిలకలూరిపేటలో జరగబోతున్న 'ప్రజాగళం' సభ పైనే ఉంది. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రధాని మోదీ 4.10 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రజాగళం సభకు హెలికాప్టర్ లో మోదీ వెళ్తారు. ఎయిర్ పోర్టులో మోదీ కోసం నాలుగు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్లు రెండు, నైట్ విజన్ ఉన్న ఆర్మీ హెలికాప్టర్లు రెండు ఉన్నాయి. 

చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ సిబ్బంది సభాప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకుంది. 5 వేలకు పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు.   

Narendra Modi
BJP
Praja Galam Sabha
  • Loading...

More Telugu News