Gaint Galapagos Tortoise: హైదరాబాద్ జూలో 125 ఏళ్ల తాబేలు మృతి

Giant Galapagos tortoise in Hyderabad zoo dies

  • మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్‌తో గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృతి
  • పోస్ట్‌మార్టం నివేదికలో ఈ విషయం తేలిందన్న జూ అధికారులు
  • 1963లో పబ్లిక్ గార్డెన్స్ నుంచి జూపార్క్‌కు వచ్చిన తాబేలు

హైదరాబాద్‌ జూలోని 125 ఏళ్ల వయసున్న ఓ మగ తాబేలు మృతి చెందింది. ఈ గాలాపాగోస్ జెయింట్ తాబేలును 1963లో పబ్లిక్ గార్డెన్స్ నుంచి జూ పార్క్‌కు తరలించారు. అయితే, ఇది కొంతకాలంగా అనారోగ్యంతో ఉందని జూ పార్క్ అధికారులు తెలిపారు. పలు అవయవాలు విఫలం కావడంతో తాబేలు మరణించినట్టు పోస్ట్‌మార్టంలో తేలిందన్నారు. పరిశోధనల కోసం తాబేలు శాంపిల్స్‌ను రాజేంద్రనగర్‌లోని వీబీఆర్ఐ అండ్ వెటర్నరీ కాలేజీకి పంపామని చెప్పారు.

More Telugu News